వేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ స్వామి దేవస్తానానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి -రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భక్తజనులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. స్వామి వారికి మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రాబిషేకం, కోడె మొక్కుల పూజలు చెల్లించడం కోసం భక్తులు బారులు తీరారు.