
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా ఆరో ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్లన్న కోనేరులో స్నానం చేసి స్వామికి తలనీలాలు సమర్పించి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.
అనంతరం గంగరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. .ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ధర్మకర్తలు ప్రభాకర్, శ్రీనివాస్, వల్లద్రి అంజిరెడ్డి ఉన్నారు.