
కామేపల్లి, వెలుగు : మండలంలోని కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందలాది వాహనాలకు పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లమోతు శేషయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి పాల్గొన్నారు.