భద్రాచలం రాములోరి కల్యాణానికి వేళాయే.. గోదావరి తీరంలో భక్తుల ఆనందహేల

భద్రాచలం రాములోరి కల్యాణానికి వేళాయే.. గోదావరి తీరంలో భక్తుల ఆనందహేల

భద్రాచలం, వెలుగు : మరి కొద్ది గంటల్లో జగదభిరాముడి కల్యాణం.. ఆ ఘట్టం తిలకించి, తలంబ్రాలు తీసుకునేందుకు భక్తులు ఎన్నో మైళ్ల నుంచి తరలివచ్చారు. మండే ఎండ నుంచి సేద తీరేందుకు గౌతమిలో సాయం సంధ్య వేళ జలకాలాటలు ఆడుతూ కేరింత కొడుతూ అలసటను మరిచిపోయారు. భక్తులు కరకట్ట మీద నుంచి నడుచుకుంటూ వచ్చి చెట్ల కింద తమ వసతిని ఏర్పాటు చేసుకున్నారు. కొందరేమో చలువ పందిళ్లను ఆశ్రయించారు. అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసిన హట్స్ భక్తులను ఆకట్టుకున్నాయి. 

అదిగో భద్రాద్రి .. ఇదిగో గౌతమి అంటూ కీర్తనలు ఆలపిస్తూ భక్తులు గోదావరి తీరంలో చేసిన సందడి అంతాఇంతా కాదు.. రాత్రి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా కొనసాగింది.  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు‌‌‌‌