వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క,సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
ఫిబ్రవరి నెలలో జరిగే సమ్మక్క,సారలమ్మ ఉండనుంది. ఈ జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. నేటి నుండి రాబోయే నాలుగు ఆదివారలు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
కాగా గర్భాలయంలో ఆర్జిత సేవలు, అన్నపూజలను అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీతో గతంలో వచ్చిన హుండీ ఆదాయంతో కంటే అధికంగానే పెరిగింది. సీసీ కెమెరాలు, SPF, పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.