యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి మూడు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంట టైం

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి మూడు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంట టైం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, వ్రతమండపాలు, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియా, కొండపైన బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

భక్తుల రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట టైం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయంలో నిర్వహించిన నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.57,52,702 ఆదాయం వచ్చింది. 

అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.19,32,320, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9.30 లక్షలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శనాలతో రూ.3,45,600 ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. మరోవైపు ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. 

బంగారు తాపడం కోసం రూ.5 లక్షల విరాళం

యాదగిరిగుట్ట నారసింహుడి విమాన గోపుర బంగారు తాపడం కోసం విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం హనుమకొండకు చెందిన వాకా సత్యనారాయణ జయలలిత దంపతులు రూ.5,01,116 విరాళం ఇచ్చారు. ఆలయ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చేతుల మీదుగా విరాళానికి సంబంధించిన నగదును అందజేశారు. అనంతరం దాతలకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామివారి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.