నడక మార్గాన తిరుమల వెళ్తున్న భక్తులను పాము కాటేసిన ఘటన కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులను పాము కాటేసింది. చీరాలకు చెందిన భక్తులు దర్శనానికి వెళ్తుండగా ఏడవ మైలు వద్ద పాము కాటేసినట్లు తెలుస్తోంది. పాము కాటుకు గురైన భక్తులను అంబులెన్స్ లో తిరుపతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నడక మార్గాన వెళ్తున్న భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు.