యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​ దర్శించుకున్నారు. ఆయనకు కలెక్టర్​ పమేలా సత్పతి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం న్యాయమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామి వారి ప్రసాదం అందించారు.

పోటెత్తిన భక్తులు..

ఆదివారం కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. రద్దీ కారణంతో స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఎండ వేడి నుంచి భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.