యాదాద్రి, వెలుగు: భువనగిరి పార్లమెంట్ నుంచి అయోధ్యలో శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. అయోధ్యకు వెళ్లే స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్‌కు ఆదివారం సాయంత్రం చేరుకుంది.
ఈ ట్రైన్లో 1350 మంది భక్తులకు ముందుగానే రిజర్వేషన్ చేశారు. పార్లమెంట్పరిధిలోని వీరంతా భువనగిరికి చేరుకొని ఇక్కడి నుంచి అయోధ్యకు తరలివెళ్లారు. ఈ ట్రైన్‌ను బీజేపీ స్టేట్జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, పాపారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, మల్లేశం, పడాల శ్రీనివాస్, బందారపు లింగస్వామి, చిరిగె శ్రీనివాస్, రత్నపురం శ్రీశైలం, చందా మ హేందర్ గుప్తా, రత్నపురం బలరాం ఉన్నారు.