జగన్నాథపురం పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా పూజలు

జగన్నాథపురం పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా పూజలు
  • నేడే శివాలయ విగ్రహ ప్రతిష్ఠ 

పాల్వంచ, వెలుగు : పాల్వంచ మండలంలోని కేశవాపురం జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శివాలయం జీవధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11:30 గంటలకు స్థిర మంత్ర విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవో పేతంగా నిర్వహించనున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణం జరిగి 60 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ వేడుకలను వైభవో పేతంగా నిర్వహించనున్నారు.

 కాగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో వందలాది మంది మహిళలు సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ ఈవో రజనీ కుమారి, మాజీ చైర్మన్ మహిపతి రామలింగంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.