నగలు  పోయాయా.... అయితే ఈ గుళ్లో మొక్కులు చెల్లిస్తే దొరుకుతాయట..

నగలు  పోయాయా.... అయితే ఈ గుళ్లో మొక్కులు చెల్లిస్తే దొరుకుతాయట..

మనదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయానికి ఒక చారిత్ర ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అంతేకాదు కొన్ని ఆలయాలను దర్శించుకోవడం వలన శుభఫలితాలు లభిస్తాయని నమ్మితే.. మరికొన్ని ఆలయాలలోని నీరు, మట్టి, ఇలాంటి కూడా అద్భుతాలు చేస్తాయని విశ్వాసం. అలాంటి ఓ ఆలయంలోని అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే పోయిన నగలు తిరిగి వస్తాయని భక్తులు విశ్వసిస్తారు.  అయితే ఆ ఆలయం ఏడాదిలో నాలుగు రోజులు మాత్రమే తెరుస్తారట.. ఇంతకూ ఆ ఆలయంలో దేవుడు ఎవరు.. ఆ గుడి ఎక్కడ ఉందో వివరాలు తెలుసుకుందాం. . . . 

ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ గ్రామం హలియాల్‌లోని  ముత్తల్లి గౌరమ్మ  దేవత 500 సంవత్సరాలుగా  పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం వినాయకచవితి మరుసటి రోజు నుంచి నాలుగు రోజులు మాత్రమే తెరుస్తారు,  రోజూ దాదాపు 5 వేల నుంచి 10 వేల మంది ఆలయాన్ని సందర్శిస్తుంటారు.  ముత్తల్లి గౌరమ్మ తల్లి ఆశీస్సుల కోసం దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారు.

ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ గ్రామం హలియాల్‌లోని జిటి నాయక్ ఇంట్లో ఆమెకు పూజలు చేస్తున్నారు.  ఈ దేవాలయంలో  పూజలు బిలగి రాజులు నాయక్ కుటుంబం వారు వారసత్వంగా నిర్వహిస్తుంటారు.  ఈ దేవాలయంలో ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు. ఏ పూజ చేయాలన్నా.. ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.   ఇక్కడి అమ్మవారి విగ్రహం చెక్కతో తయారు చేయబడి ఉంటుంది.  ఎవరైనా ఆభరణాలు పోగొట్టుకుంటే .. ఇక్కడి దేవతకు మొక్కుకుంటే పోయిన నగలు తిరిగి వస్తాయని భక్తులు నమ్ముతారు.  ఈ సంప్రదాయం శతాబ్ధాల కాలం నుంచి కొనసాగుతుంది.  ఇంకా సంతానం కోసం ముత్తల్లి గౌరమ్మను వేడుకుంటారు.  మహిళలు చిన్న వెండి.. బంగారు ఊయలలను దేవాలయంలో మొక్కులు చెల్లిస్తే సంతానం కలుగతారని విశ్వసిస్తుంటారు. 

 ఇంకా ఈ దేవాలయంలో గణేశుడు.. గౌరీ దేవత  విగ్రహాలు పక్కపక్కనే ఉంటాయి.  గణేశుడి ఆలయం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.  త్రేతా యుగంలో నాలుగు రోజుల పాటు అమ్మవారు భూలోకాన్ని సందర్శించారని.. ఆ సమయంలో ఈ ప్రాంతంలో  మహిళలు బందిపోటు దొంగల వలన ఆభరణాలు  పోయి బాధపడుతున్నారని.. అలాగే వివాహితులు సంతానం లేక బాధపడుతున్నారని.. గుర్తించిన గౌరమ్మ అప్పటి నుంచి  అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. 

అయితే 500 సంవత్సరాలుగా ఈ దేవాలయం ఉన్నా అభివృద్దికి నోచుకోలేదు. ఎంతో మహిమాన్వితం కలిగిన ఈ దేవాలయాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.   కనీసం హాలియాలో ఈ దేవాలయానికి వెళ్లేందుకు బస్ సౌకర్యం లేదని భక్తులు వాపోతున్నారు.  వర్షాకాలంలో ఈ గుడికి రావాలంటే సాహసకృత్యం చేయాల్సిన పని.. వాహనాలను ఈ రూట్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  దీంతో చాలామంది భక్తులు దాదాపు 3.5 కిలోమీటర్లు నడిచి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.  ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దేవాలయాన్ని అభివృద్ది చేయాలని స్థానికులు కోరుతున్నారు. . .