- కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవురోజు , కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ర్టం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాజన్న సన్నిధికి వచ్చారు.
కోడెల క్యూలైన్, దర్మదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలో ప్రవేశించి ఆలయంలో స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం ఆలయ ముందుబాగంలో రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.