ఒక్కరోజే లక్ష మంది..బడా గణేశుడి దర్శనానికి బారులు

ఒక్కరోజే లక్ష మంది..బడా గణేశుడి దర్శనానికి బారులు
  •  ఒక్కరోజు లక్ష మంది భక్తుల దర్శనం
  •  తరలివచ్చిన వీఐపీలు..
  • ఆకట్టుకున్న  సాంస్కృతిక కార్యక్రమాలు

ఖైరతాబాద్/హైదరాబాద్​సిటీ, వెలుగు:ఖైరతాబాద్​లో కొలువైన శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. గురువారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారని అంచనా. మరోవైపు సాధారణ భక్తులతోపాటు వీఐపీలు బడా గణపతి దర్శనానికి తరలివచ్చారు. 

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్​వెంకటేశ్​ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి, టీడీపీ పొలిట్​బ్యూరోసభ్యుడు అరవింద కుమార్​గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపం ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్థానిక నృత్య శిక్షణాలయానికి చెందిన విద్యార్థులు కూచిపూడి నృత్యంతో అలరించారు.

Also Read:-పెట్రోల్‌‌, డీజిల్ ధరలు తగ్గే చాన్స్‌‌?

నిమజ్జనానికి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు  

గణేశ్​నిమజ్జనం సజావుగా సాగేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇద్దరు అడిషనల్ కమిషనర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఖైరతాబాద్ జోన్ బాధ్యతలను పంకజకు, సికింద్రాబాద్ జోన్ బాధ్యతలను రఘుప్రసాద్ కు అప్పగించారు.  ట్యాంక్ బండ్ పై జరిగే నిమజ్జనం ఈ రెండు జోన్ల పరిధిలోకే వస్తుంది. ఈ నేపథ్యంలో కమిషనర్​స్పెషల్ ఆఫీసర్లను 
నియమించారు.