హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భగుడిని ఐదువేల పుస్తకాలతో అలంకరించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఎల్లమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.