
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 70,496 మంది భక్తులు దర్శించుకోగా 25 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీడీ 5.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.
దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ అనే సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. ఇందులో వారణాసికి మొదటి ప్లేస్ దక్కించుుకుంది. తిరుమల తరువాత వారణాసి, శిర్డీ ఉన్నాయి.