ప్రముఖ పుణ్యక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి మల్లన్నను దర్శించుకుంటున్నారు. రెండున్నర నెలల పాటు కొనసాగనున్న ఈ జాతర.. ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగియనుంది. మల్లన్నకు ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచే శారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. రేపు స్వామివారి కల్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.