కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు సౌకర్యాలను పర్యవేక్షించారు.