మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తుల పాదయాత్ర

బోధన్, వెలుగు: మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఉన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తులు పాదయాత్రగా బయలు దేరారు. టౌన్​లోని జంగం గల్లిలోని పురాణే మఠం వద్ద సుంకిని సిద్ధేశ్వర్​ మహరాజ్​ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగం లింగాయత్​ సమాజానికి చెందిన పురాణే అజయ్ కుమార్, కర్నే హన్మంత్​రావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ యాత్రను నిర్వహిస్తామన్నారు.

15 రోజులు పాటు సాగే యాత్రలో 365 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మన్మథ్ స్వామి క్షేత్రానికి చేరుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ జంగం లింగాయత్ ప్రముఖులు వీఆర్ దేశాయ్, నరసింగప్ప, శ్యామ్ రావు, లక్ష్మణ్ పటేల్, సంతోష్ మహారాజ్, గంగాధరప్ప, రాజేందర్ కుమార్, శంకరప్ప, విఠలప్ప, పురాణే దిలీప్ కుమార్, వీరశైవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ : మాకు పెళ్లి చేయండి స్వామీ : బ్రహ్మచారుల ఆలయాల పాదయాత్ర