అయోధ్య అక్షింతలతో శోభాయాత్ర

చండ్రుగొండ, వెలుగు : అయోధ్య రామ మందిరంలో పూజలు చేసిన అక్షింతలను  తెచ్చిన విశ్వహిందూ మండల కమిటీ సభ్యులు మంగళవారం చండ్రుగొండలో శోభాయాత్ర నిర్వహించారు. సభ్యులు అక్షింతలతో గ్రామ వీధుల వెంట జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ  జనవరి 1 నుండి 15 వరకు ఇంటింటికీ అక్షింతలు, సీతారామ చంద్రమూర్తి ఫొటోను  గ్రామ కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామన్నారు. 

జనవరి 22న అయోధ్యలో బాల రాముడి  ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అప్పటి వరకు అక్షింతలను ఇండ్లలోని  పూజా మందిరం లో భద్రపర్చుకోవాలని సూచించారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అక్షింతలతో ఇంటి పెద్దల ద్వారా ఆశీస్సులు పొందాలని చెప్పారు. అదే రోజు ఇంటి ముందు ఐదు దీపాలను వెలింగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పవన్ కుమార్, విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యులు రామారావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.