
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తజనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మేకపోతులను బలిచ్చి నైవేద్యం సమర్పించి దాసంగాలు పెట్టారు. భక్తులు ఒక్కసారిగా పెరగడంతో ఆలయ పరిసర ప్రాంతాలంతా భక్తులతో కిటకిటలాడిపోయాయి. గద్వాల, వెలుగు: