జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వలుగు: ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.