![గూడెంలో పౌర్ణమి జాతర](https://static.v6velugu.com/uploads/2025/02/devotees-throng-satyadev-pournami-jatara-in-gudem_wkH8b4WUlf.jpg)
దండేపల్లి, వెలుగు: దండేపల్లి మండలం గూడెంలో సత్యదేవుడి పౌర్ణమి జాతర బుధవారం ఘనంగా జరిగింది. మరో అన్నవరంగా ప్రఖ్యాతి గాంచిన గూడెం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మాఘ శుద్ధ పూర్ణిమ జాతరకు భక్తులు పోటెత్తారు.
సామూహిక వ్రతాలు ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గుట్టకు ఎడమ పక్కనున్న రోడ్డుపైన కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. లక్సెట్టిపేట సీఐ నరేందర్, దండేపల్లి ఎస్ఐ తైసినోద్దిన్ బందోబస్తు నిర్వహించారు.