మల్లన్న నామస్మరణతో .. మార్మోగిన కొమురవెల్లి

మల్లన్న నామస్మరణతో .. మార్మోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో  భాగంగా మొదటి ఆదివారం నిర్వహించే  పట్నంవారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. స్వామివారి దర్శనానికి ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. 

ముందుగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.   అనంతరం మల్లన్న గుట్టపై వెలసిన శ్రీరేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. హైదరాబాద్ కు చెందిన యాదవ భక్తులు తోటబావి వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాలు  నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.