- కొలువుదీరిన అమ్మవార్లు భారీగా తరలివచ్చిన భక్తులు
గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లులు గద్దెపైకి చేరగా, శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. పుణ్య స్నానాలాచరించి బెల్లం, కొబ్బరికాయలు, కోళ్లు, యాటలతో మొక్కులు సమర్పించారు. సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల జాతరకు ఒక్కరోజే లక్షమంది వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని పలు జాతరల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాకతీయ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లో భక్తులు స్నానాలాచరించారు. క్యూలైన్‌లో ఓ మహిళా భక్తురాలు సృహ తప్పగా హెల్త్ సిబ్బంది ఆమెకు చికిత్స అందించారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు దంపతులు అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు.
నెట్‌వర్క్, వెలుగు