మెదక్​ జిల్లాలో న్యూ ఇయర్ సందడి .. ఆలయాలు, చర్చిలకు పోటెత్తిన భక్తులు

మెదక్​  జిల్లాలో న్యూ ఇయర్ సందడి .. ఆలయాలు, చర్చిలకు పోటెత్తిన భక్తులు

సిద్దిపేట, సంగారెడ్డి టౌన్‌, మెదక్​ టౌన్​, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలో న్యూ ఇయర్‌‌ సందడి నెలకొంది. కుటుంబాలతో సహా ఆలయాలు, చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు భక్తులు బారులుదీరారు. పర్యాటక ప్రాంతాల్లో జనం రద్దీ పెరిగింది. సిద్దిపేట పట్టణంలోని కోమటిబండ చెరువు మినీట్యాంకు బండ్‌కు భారీగా తరలివచ్చారు. మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న కేబుల్‌ బ్రిడ్జి, జురాసిక్ పార్క్, సైక్లింగ్, బోటింగ్, నైట్ గార్డెన్, అడ్వెంచర్ పార్కులలో సందడి చేశారు. వేంకటేశ్వరస్వామి దేవాలయం, కోటిలింగాల, నాగదేవత, అయ్యప్ప స్వామి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. సీఎస్ఐ చర్చిలో క్రిస్టియన్ సామూహిక ప్రార్థనలు చేశారు. 

సంగారెడ్డి పట్టణంలోని శ్రీ లక్ష్మీ గోదాసమేత విరాట్ వేంకటేశ్వర స్వామి(వైకుంఠపురం), నవరత్న, సంగమేశ్వర స్వామి దేవాలయాలలో, క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంచాలని దేవుడిని ప్రార్థించారు.మెదక్​ కోదండ రామాలయం. శ్రీవెంకటేశ్వర ఆలయంలోలో ప్రత్యేక పూజలు జరిపారు. చ  ఉదయమే చర్చిలో శిలువ ఊరేగింపు నిర్వహించారు.