ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర్గామాత మందిరాల్లో పురోహితులు కుమార్ శర్మ, నందిశ్వీర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
రామాలయం నుంచి జీవకోనేరు వరకు పల్లకీసేవ జరిగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ బారడ్ రమేశ్, భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, బొబిడె కిషన్, అయ్యప్ప శ్రీనివాస్, తమల్లారెడ్డి పాల్గొన్నారు.