తిరుమల కొండపై ఇంత కంటే ఘోరం ఉంటుందా.. : మహా ద్వారం వరకు క్యూలో చెప్పులతో వచ్చిన భక్తులు

తిరుమల కొండపై ఇంత కంటే ఘోరం ఉంటుందా.. : మహా ద్వారం వరకు క్యూలో చెప్పులతో వచ్చిన భక్తులు

తిరుమల కొండ.. తిరుమల కొండ.. అది శ్రీనివాసుని నివాసం అని అందరికీ తెలుసు.. కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువైన ఉన్న మహా పుణ్యక్షేత్రం తిరుమల కొండ. అలాంటి కొండపై ఎంతో నిష్ఠగా స్వామివారిని ఆరాధించాల్సింది పోయి.. ఇటీవల కాలంలో ఘోర అపచారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న కొండపై మద్యం బెల్ట్ షాపు.. ఆ తర్వాత బిర్యానీ, సిగరెట్లు వంటిపై కొండపై దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ భద్రతా సిబ్బంది వైఫల్యాలు. ఇప్పుడు అంతకు మించి.. ఘోర అపచారం జరిగింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు.. ఏకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు చెప్పులతో వచ్చారు.. ప్రతి దగ్గర ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తులు చెప్పులతో తిరగటం అనేది ఇప్పుడు ఊహకు అందని అపచారంగా చూస్తున్నారు భక్తులు. 

తిరుమల కొండపై విజిలెన్స్ సెక్యూరిటీ వైఫల్యం మరోసారి భయపడింది. తనిఖీలు చేయకుండానే.. తనిఖీలు లేకుండా భక్తులను క్యూ లైన్లలోకి వదిలేస్తున్నారు అనేది ఈ ఘటనతో స్పష్టం అయ్యింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు.. చెప్పులతో మహా ద్వారం వరకు వచ్చారు. ఈ విషయాన్ని.. మహాద్వారం దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి.. ఆ భక్తులకు సూచించటంతో.. వాళ్లు చెప్పులను మహాద్వారం దగ్గర బయటకు విడిచారు. క్యూ లైన్లలోకి భక్తులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వదులుతారు.. అలాంటిది క్యూ కాంప్లెక్స్ దగ్గర విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నగా ఉంది. 

శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసిన భక్తులు.. దర్శనంలో భాగంగా చెప్పులతో ధరించి మరీ స్వామి దర్శనానికి రావటం అనేది కూడా ఊహకు అందని ఘోరంగా చెబుతున్నారు భక్తులు. తెల్ల చెప్పులు స్పష్టంగా కనిపిస్తున్నా..  గుర్తించలేకపోయిన విజిలెన్స్ సిబ్బంది కళ్లు మూసుకుని ఉన్నారా అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. 
మహాద్వారం వరకు అలా ఎలా వచ్చారు.. వైకుంఠం 1 నుంచి అన్ని తనిఖీలు ఎలా దాటి వచ్చారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. సిబ్బంది నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇతర వ్యాపకాలపై ఉన్న శ్రద్ద భద్రతపై లేదా అని ప్రశ్నిస్తు్న్నారు భక్తులు. చెప్పులు వేసుకురావడంపై ఉత్తరాది భక్తులకు తెలియకపోవచ్చు.. తెలియజేయాల్సిన బాధ్యత సిబ్బందికి లేదా అంటున్నారు. సెక్యూరిటీ వైఫల్యంపై టీటీడీ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

ఏదిఏమైనా తిరుమల కొండపై ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని.. వినని ఘోరాలు మాత్రం వెలుగులోకి రావటం అనేది శ్రీవారి కొండ పవిత్రతకు.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లే అంటున్నారు భక్తులు.