తెప్పోత్సవం.. నయనానందకరం .. ఏరు ఫెస్టివల్​తో పులకించిన గోదావరి తీరం

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరంలో గురువారం రాత్రి నిర్వహించిన సీతారాముల తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. అంతకుముందు తిరుమంగై ఆళ్వార్​ పరమపదోత్సవం వేదోక్తంగా నిర్వహించారు. పోటెత్తిన భక్తులు ప్రత్యేకంగా నిర్వహించిన ఏరు ఫెస్టివల్​ను భక్తులు తిలకించి పులకించారు. మూడు రోజుల ఈ ఫెస్టివల్​లో పరంపర ఫౌండేషన్​ కళాకారుల నృత్యరూపకాలు హైలెట్​గా నిలిచాయి. 

ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ, ఆదివాసీ సంప్రదాయ రేలా నృత్యాలు కనువిందు చేశాయి. స్నానఘాట్​పై ఏర్పాటు చేసిన స్టాల్స్ భక్తులతో సందడిగా మారాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, సీతారాముల జలవిహారం తెప్పోత్సవం చూసి మురిసిపోయారు.   - భద్రాచలం, వెలుగు