
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల కింద భైంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు తరలివెళ్లాయి. అయితే, భారీ వర్షాల కారణంగా జమ్ము కాశ్మీర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీంతో ఈ మార్గంలో యాత్రను నిలిపివేశారు. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భైంసా నుంచి వెళ్లిన బృందాన్ని ఆర్మీ జవాన్లు రక్షించి బేస్ క్యాంపునకు తీసుకెళ్లారు. రెండ్రోజులుగా తామంగా ఆర్మీ బేస్ క్యాంప్‌లో సేఫ్‌గా ఉన్నామని బృందంలోని గుజ్జల్వార్ వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, కల్యాణ్, సచిన్‌లు తెలిపారు.