కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.13,43,831 ఆదాయం వచ్చినట్లు ఈవో రామకృష్ణారావు, ఏఈఓ అంజయ్య తెలిపారు.
కాగా కొండగట్టు ఆలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పెయిడ్ పార్కింగ్ పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల వాహనాలు గుట్టపైకి వెళ్లేందుకు రూ.50 వసూల్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.