రత్నాలు మొత్తం తొమ్మిదేనా.. ఇంకా ఉన్నాయా.. అవి ఎలా పుట్టాయి....పురాణ కథ ఇదే..

రత్నాలు మొత్తం తొమ్మిదేనా..  ఇంకా ఉన్నాయా.. అవి ఎలా పుట్టాయి....పురాణ కథ ఇదే..

నవగ్రహాలకు చాలా జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాధన్యత ఉంది.   జాతక రీత్యా అన్ని గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు.  అవి జాతకరీత్యా చెడు ప్రభావాన్ని కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ గ్రహాలను  శాంతింపచేసేందుకు ఉపశమనంగా కొన్ని ప్ర్యత్యేకమైన రాళ్లతో (రత్నాలతో) తయారు చేసిన ఉంగరాలను ధరించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.  ఆ రత్నాలన్నీ బలి రాజు శరీరం నుంచి పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి.  అయితే వాడుకలో ఎక్కువుగా నవరత్నాలు ఉన్నాయి.  కాని  పురాణాలు తెలిపిన ప్రకారం మొత్తం 21 రత్నాలు ఉన్నాయి.  అసలు ఈ రత్నాలు ఎలాపుట్టాయి.. వాటికి విష్ణుమూర్తికి గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం. . .  

పురాణాలప్రకారం 15 వేల సంవత్సరాల క్రితం బలిరాజు యజ్ఞం చేశాడు.  దేవరాజు ఇంద్రుని ఆదేశం ప్రకారం.. విష్ణుమూర్తి వామన రూపాన్ని ధరించాడు.  బలిరాజు తల పెట్టిన  యజ్ఞం ప్రకృతి వినాశనానికి  అని భావించిన వామన రూపంలో ఉన్న  విష్ణువు బలిరాజును మూడు అడుగుల నేలను ఇమ్మని అడిగాడు.  అప్పుడు  బలి చక్రవర్తి ఇస్తానని వాగ్ధానం చేశాడు.  వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి  ఒక అడుగు భూమిని ఆకాశంగా.. మరో అడుగు భూమిని భూమిగా మార్చాడు. తన శరీర ఆకృతిని పెంచిన వామనుడు ఒక అడుగు ఆకాశంలో.. మరో అడుగు భూమిలో పెట్టాడు.  ఇక మూడో అడుగు పెట్టేందుకు స్థలం లేక బలిరాజు తన శిరస్సు వంచగా.. ఆయన తలపై మూడో అడుగు వేసి పాతాళలోకానికి నెట్టేశాడు.  

విష్ణుమూర్తి స్పర్శతో పాతాళంలోకి నివసించమని.. ఆయన శరీరం మొత్తం రత్నాలతో నిండిఉంటుందని..  బలిరాజును ఆదేశించగా.. ఇంద్రుడు తన ఆయుధంతో బలిరాజు  శరీరాన్ని చీల్చాడు.   అప్పుడు బలిరాజు శరారం మొత్తం 21 ముక్కలై భూమిపై పడింది.  ఆ ప్రదేశం నుంచి రత్నాలు ఉద్భవించాయి. పురాణాల ప్రకారం  బలి రాజు శరీరం ఏ భాగం నుంచి ఏరత్నం ఉద్ఢవించిందో తెలుసుకుందాం. .

  • 1. వజ్రం: బాలి రాజు మెదడు భాగాల నుండి ఉద్భవించింది.
  • 2. ముత్యం: త్యాగం యొక్క మనస్సు నుండి పుట్టినది
  • 3. రూబీ (కెంపు) : బాలి రాజు రక్తం నుండి
  • 4. పచ్చ: బాలి రాజు పిత్త మూలకం నుండి
  • 5. ప్రవల్ ( పగడం) : సముద్రంలో పడిపోయిన త్యాగం యొక్క రక్తపు బిందువు
  • 6. పుష్యరాగము: బలి మాంసం ముక్కల నుండి
  • 7. నీలం: బాలి కళ్ళ నుండి పుట్టినది
  • 8. చంద్రకాంత మణి ( మూన్​ స్టోన్​) : కంటి కనుపాప నుండి ఉద్భవించింది.
  • 9. గోమేధికం: త్యాగం చేసిన వ్యక్తి కొవ్వు నుండి తయారు చేయబడింది.
  • 10. టర్కోయిస్(  బ్లూ స్టోన్): బాలి రాజు నరాల ముక్కల నుండి టర్కోయిస్ ఉత్పత్తి చేయబడింది.
  • 1. భీష్మక ( రాజులు ధరించే హారంలో ప్రత్యేకంగా ఉండే రత్నం): బలి రాజు తల నుండి
  • 12. మసార్ మణి : బాలి రాజు మలం నుండి.
  • 13. లాజావర్త మణి: బాలి రాజు జుట్టు నుండి.
  • 14. ఉలుక్ మణి: బాలి రాజు నాలుక ద్వారా 
  • 15. వైడూర్య (వైడూర్యం): బాలి రాజు యజ్ఞోపవీతం నుండి.
  • 16. పరాస్ (పావస్ మణి): బాలి రాజు హృదయం నుండి
  • 17. క్రిస్టల్ రత్నం: బాలి రాజు చెమట నుండి
  • 18. ఉపలక్ మణి: బలి రాజు కఫం నుండి
  • 19. ఇషివ్: వీర్యం బిందువుల నుండి
  • 20. ఆయిల్ మణి: బాలి రాజు చర్మం నుండి
  • 21. ఘృత్ మణి: కుక్షి విభాగం నుండి

వీటిలో ఎక్కువుగా నవరత్నాల్లో ఉపయోగించే ముత్యం-,-కెంపు-,వైఢూర్యం-,గోమేధికం-,వజ్రం-,పగడం,పుష్యరాగం-,పచ్చ  మాత్రమే వాడుకలో ఉన్నాయి.  మిగతా రత్నాలను కృత యుగంలో.. రాజుల కాలంలో ఉపయోగించారని పండితులు చెబుతున్నారు.