ఆధ్యాత్మికం.. దివ్యత్వం అంటే ఏమిటి.. అది ఎలా ఉంటుంది..

 ఆధ్యాత్మికం.. దివ్యత్వం అంటే ఏమిటి..  అది ఎలా ఉంటుంది..

సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి.  ఇలా జరిగే ప్రతి మార్పునకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకే ప్రకృతిని దేవతగా...అమ్మగా... పరమేశ్వర శక్తిగా కొలుస్తాం.   ఇక ప్రతి జీవికి.. ఎండా.. వాన... గాలి .. ఈ మూడు ప్రాణ దాతలే.  వీటిని ప్రకృతిలో ఏదో తెలియని దివ్యత్వం ఉందని... జడపదార్థం కాదని స్పష్టమవుతుంది.  ఈ దివ్యత్వం గురించి మహర్షులు.. రుషులు .. వేదాలలో తెలియజేశారు.  

మనిషి తట్టుకోలేక.. అసహనంతో ఎండ ఎక్కువైనప్పుడు  ఎండను.. వర్షాలు ఎక్కువైనప్పుడు.. వానలను నిందిస్తాడు. అయితే సూర్యకాంతి రెండు రోజులు శరీరానికి సోకపొతే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.  వర్షా కాలంలోవర్షాలు పడకపోతే మానవుడు మదనపడతాడు.  ఇవి ఎక్కువ అయితే నిందించేది కూడా ఇతడే.  ఎండ కాసినా.. ఎక్కువైనా.. వర్షాలు లేకపోయినా.. పడినా.. మానవుడు రెండు రకాలుగా ప్రకృతిని నిందిస్తాడు. ఇదంతా మనిషి ఆలోచనా లోపం అని  పండితులు అంటున్నారు.

భగవంతుడు ప్రకృతిలో కనపడతాడు.  మండుటెండలో సేద  తీరేందుకు .... చల్లగా ఉండేందుకు ..చలువదనాన్ని ఇచ్చే ఫల పుష్పాలను సృష్టించాడు.  ఎలాంటి విపత్తునుంచైనా  కాపాడుకునేందుకు..  తనను తాను రక్షించుకునేందుకు మనిషికి బుద్దితో పాటు అనేక శక్తులను కూడా ఇచ్చాడు.  ఇలా మానవుడు వాటిని ఉపయోగించుకొని శాశ్వతంగా ప్రయోజనాన్ని పొందగలడు.  అంతేకాని ప్రకృతిరి ఎట్టి పరిస్థితుల్లో విసుక్కోవడం.. నిందించకూడదని సనాతన ధర్మశాసనం.  

 ప్రకృతికి కూడా మనస్సు ఉంటుందని.. అది మన స్పందనలకు ప్రతి స్పందిస్తుందని పండితులు చెబుతున్నారు,  మానవునికి.. ప్రకృతికి ఆత్మీయతా బంధాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రకృతిలో జరిగే పరిణామాలు అన్ని.. లోక క్షేమం కోసమే ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. సూర్యుడు ఎక్కువుగా నీటిని గ్రహించి వేడిని వెదజల్లకపోతే వర్షాకాలంలో మేఘం ఏర్పడటం సాధ్యపడదు.  వర్షాలు సమృద్దిగా కురవకపోతే .. సూర్యతాపానికి నీటి వనరులు నశించిపోతాయి.  

పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, వీటివల్ల మనం  చాలా ప్రయోజనాలు పొందుతున్నాం.  కాని ప్రకృతి ఎప్పుడూ శాంతంగా ఉండాలని ఆకాక్షించే   యజ్ఞ సంస్కృతిలో చైతన్యవంతమైన ప్రకృతి హృదయాన్ని స్పందింపజేయగలిగే ఆరాధనా దృష్టి గోచరిస్తుంది. ఈ ప్రకృతి కేవలం మనిషి కోసం మాత్రమే సృష్టించబడలేదు.ఈ భూమిపై ఉన్న  సమస్త జీవరాశి కోసం ఇది పనిచేస్తోంది. కేవలం మన అవసరాలకు సరిపోలేదనో, లేదా అధికమయ్యిందనో నిందించకూడదు.  సాధారణంగా బురద అంటే మనము విసుక్కుంటాం.  కాని అది మనకు అనవసరమేమోగానీ, దానిలో బ్రతికే జీవరాశికి అది ప్రాణాధారం. ప్రకృతికి సర్వజీవకోటి అవసరం .  

మానవుడు ప్రగతి అనే భ్రమలో పడి .. ప్రకృతిని పీడిస్తున్నాడు.  అమ్మ .. ఎప్పుడు.. ఎలా.. ఏ అవస్థలోనైనా బిడ్డ క్షేమాన్నే కోరినట్లుగా - .. ఎండలూ, వానలూ, గాలులూ జగదీశ్వరి అనుగ్రహాలుగా దర్శించిననాడు ...  తప్పకుండా ఏ విలయమూ లేని పరిసరాలు మనచుట్టూ ఏర్పడతాయి. ఇలా ప్రకృతి అంతా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతుంది.