ఆధ్యాత్మికం : సంతోషంగా జీవించాలంటే ఏమి కావాలి.. శ్రీకృష్ణుడు.. అర్జునుడితో చెప్పిన మాటలు ఇవే..!

ఆధ్యాత్మికం : సంతోషంగా జీవించాలంటే ఏమి కావాలి.. శ్రీకృష్ణుడు.. అర్జునుడితో చెప్పిన మాటలు ఇవే..!

ఆశకు పరిధి ఉండదు. బతకడానికి సంపద అవసరమే కానీ, దానికి మితం ఉండాలి. ఎంతవరకు అనేది ఎవరికి వాళ్లు నిజాయితీగా నిర్ణయించుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ తృప్తిగా బతుకుతారు. 

సంతృప్తిగా బతకడం ఎలా అంటే.. ఎవ్వరూ ఇలా అని కచ్చితంగా చెప్పలేరు. ఎవరికి వాళ్లు తెలుసుకోవాల్సిందే. నెలకు లక్షరూపాయలు సంపాదించే వాళ్లకన్నా పదివేలు సంపాదించే వాళ్లు తృప్తిగా ఉండొచ్చు. ఏసీ కార్లలో తిరిగే వాళ్లకంటే రోడ్డుమీద పని చేసుకునే వాళ్లు సంతోషంగా జీవిస్తుండొచ్చు. మరి తృప్తి ఎలా వస్తుంది? సంతోషంగా బతకడం అందరికీ సాధ్యమేనా? ఇదే విషయం గురించి చెప్పే కథలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా ఉన్నాయి. 

ఆనందంగా ఉన్నారంటే సంతోషంగా బతుకుతున్నామని పండితులు అంటున్నారు. సంతోషమే ఆనందం.. ఆనందమే అసలైన సంపద.. అలాంటిని సందపగురించి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏముందో తెలుసుకుందాం..

కాసులపై కాంక్ష 

ప్రస్తుతం చాలామంది డబ్బు  సంపాదించడం కోసమే బతుకుతుంటారు. ఆకలి, నిద్ర కూడా వదిలేసి మరీ కష్టపడుతుంటారు. తను కుటుంబం, తర్వాతి తరాలకోసం కూడబెట్టడమే పనిగా పెట్టుకుంటారు. పూర్తిగా డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడతారు తప్ప ..తృప్తి గురించి.. సంతోషం గురించి ఆలోచించరు. జీవితంలో చివరి క్షణం వరకు ధనం గురించే ఆలోచిస్తుంటారు. సంపాదించడమే జీవితానికి సార్థకత అని భ్రమపడుతుంటారు. సుఖాన్నిచ్చే వస్తువులుకొని మురిసిపోతుంటారు.   ఆవస్తువుల వల్ల తృప్తి పొందుతు న్నామా.. లేదా అని మాత్రం ఆలోచించరు. 

ఇదే విషయం గురించి రామకృష్ణ పరమహంస మనిషికి దాహం తీరడానికి గ్లాసెడు మంచినీళ్లు చాలు బిందెడు అవసరం లేదు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిందెడు నీళ్లకోసం తపిస్తూ దాహం వేస్తున్నా సరిగా నీళ్లు తాగలేకపోతున్నారని చెప్తాడు. అందుకే మనిషికి తృప్తి లేకుండా పోతోంది. ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఆశతో తృప్తిగా బతకలేకపోతున్నారు.

ఆశ.. తృప్తి 

ఆశకు అంతు ఉండదు..... తృప్తికికొలమానం ఉండదు.. ఆశ.... తృప్తి అనేది ఎవరికి వాళ్లు వాళ్ల శ్రమను ప్రమాణంగా తీసుకుని నిర్ణయించుకోవాలి.   ఒక వ్యాపారికి బంగారం.. భార్య అంటే చాలా ఇష్టం. ఏది లేకపోయినా జీవితం వృథా అనుకుంటాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే.. తను తాకిందల్లా బంగారం కావాలని కోరుకున్నాడు. ఆ క్షణం నుంచీ అతను ఏది తాకినా బంగారం అయిపోతుంది. దాంతో వ్యాపారి బాగా సంతోషించాడు. నాలుగు రోజుల తర్వాత భార్య ఊరి నుంచి వచ్చింది. భార్యను చూసిన ఆనందంతో దేవుడు ఇచ్చిన వరం మరిపోయి మెడ తాకాడు. అంతే ఆమెకూడా బంగారమై పోయింది. తన అత్యాశకు తానే బాధపడ్డాడు. 

ఇలాగే అది శంకరాచార్యులు ఆశకు.. తృప్తికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తూ 'ధనం ఎక్కువగా సంపాదించాలన్న  పేరాశ విడిచిపెట్టా లి. కోరికలను జయించే శక్తి అలవర్చుకోవాలి. కష్టపడడం వల్ల న్యాయంగా ఎంతవరకు లభిస్తుందో దాంతో తృప్తిపడడం నేర్చుకోవాలి" అని చెప్తాడు. ఆశకు పరిధి ఉండదు బతకడానికి సంపద అవసరమే కానీ, దానికి మితం ఉండాలి. ఎంతవరకు అనేది ఎవరికి వాళ్లు నిజాయితీగా నిర్ణయించుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ తృప్తిగా బతుకుతాడు.

ఏవి ముఖ్యం 

జీవితంలో ఏది ముఖ్యం.. అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పొచ్చు. డబ్బు... కారు... పెద్ద ఉద్యోగం.... బంగళా.... ఇలా ప్రతి మనిషి బతకడానికి కనీస అవసరాలు.. తిండి... వస్త్రం...ఇల్లు మాత్రమే. కానీ ఆ డంబరాలు, అత్యాశలు, భోగాలకు పోయి మనుషులు అవసరాలకు మించి పోగేసుకునే పనిలో ఉన్నారు. భాగవతంలో ప్రహ్లాదుడు మనిషికి తృప్తిలేకపోవడానికి కారణాల గురించి.. 'ఎండమావుల్లాంటి సుఖాలు, భోగాలు మాత్రమే జీవితం అనుకుంటున్నాడు మనిషి. శరీరం రోగాల మయం..  బాధలు కలిగిస్తుందని తెలిసినా మనుషులు మాత్రం కోరికలతో తపించి పోతుంటారు. పనికిరాని సౌఖ్యాలకోసం వెంపర్లాడుతుంటారు' అని నరసింహ స్వామితో చెప్తాడు. అందుకే మనిషి ము ఖ్యమైంది ..అందుకోసం మితిమీరిన అతలను వదిలేయాలి. 

అర్హత ఉందా.. 

కొందరు తమలో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోకుండా అతిగా ఆశపడుతుంటారు. తక్కువ కష్టపడి ఎక్కువ కావాలనుకుంటారు. అర్హతలేని వాటికోసం అర్రులు చాస్తే ఫలితం రాదు. బాధే మిగులుతుంది. పైగా కష్టాలొచ్చిపడతాయి. అందుకే ఒకపని మొదలు పెట్టే ముందే ఫలితం మంచిగా వచ్చినా.. రాకపోయినా స్వీకరించే శక్తి ఉండాలి. అందుకు మనసును సిద్ధం చేసుకోవాలి. దేనిమీదా విపరీతమైన ఆశ పెంచుకోకూడదు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో 'చలి... వేడి ..లాంటి రెండింటినీ ఒకేలా తీసుకోవాలి. అసూయపడకుండా సంతోషం .... దుఖం రెండింటినీ సమబుద్ధితో చూడాలి. అప్పుడే మనిషి తృప్తిగా జీవించగలుగుతాడు' అని చెప్తాడు. కానీ అన్నీ దక్కించుకోవాలనే దురాశ. పక్కవాళ్లు తనకంటే ఎక్కువ సుఖపడుతున్నా రనే ఈర్ష, ప్రేమకోసం ఎందుకైనా తెగించే ఆవేశం...  ఇలాంటి వాటి వల్ల మనుషులు తమని తాము కోల్పోతున్నారు అందుకే ఏదైనా కావాలనీ ఆశపడే ముందే, అందుకు తనకు అర్హత ఉందా? తనలో సాధించే ప్రతిభఉందా? అందుకోసం ఏం చేయాలి... వంటి అంశాలన్నీ ఆలోచించాలి..