అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీచేశారు. కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామాలయ నిర్మాణం సాకారం కావడంతో వారు మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా బాలరాముడిని సందర్శించుకునే భక్తుల కోసం దేవ్‌రహా బాబా ట్రస్టు లక్షా 11 వేల 111 కిలోల లడ్డూను సిద్దం చేసింది.దేవ్‌రహా బాబా ట్రస్టు ఛైర్మన్ అతుల్ సక్సేనా వెల్లడించారు. వారణాసి కాశీ విశ్వనాథ్, తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రతి వారం ప్రసాదం పంపుతున్నట్లు ఆయన చెప్పారు. అయోధ్య బాలరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ దేవ్‌రహా బాబా ట్రస్టు 40 వేల కిలోల ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసింది. అనేక సేవా కార్యక్రమాలను కూడా దేవ్‌రహా బాబా ట్రస్టు నిర్వహిస్తోంది.
వందల ఏళ్ల అయోధ్య కళ ఈసారి సాకారామైంది. అయోధ్యలో ప్రసిద్ధ రామ్ లల్లా విగ్రహాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో వైభవంగా ప్రతిష్టించారు. ఈసారి రామయ్య తన జన్మభూమిలో శ్రీరామనవమి వేడులు జరుపుకోనున్నాడు. అయోధ్య రామాలయం విగ్రహం ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. అనేక మంది భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించి,మొక్కలు చెల్లించుకుంటున్నారు.
ఇప్పటికే అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే విధంగా శ్రీ రామనవమి రోజున ఈసారి బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు నేరుగా పడేటట్లు ఏర్పాట్లు చేశారు. ప్రతిఏటా నవమి రోజు ఈ అద్భుత ఘటన సాకారంఅయ్యేలా ఏర్పాటు చేశారు. మరోవైపు అయోధ్యకు వీఐపీ భక్తులతో పాటు, సామాన్య భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉన్నట్లు సమాచారం. విమానం, రైల్వే, బస్సుల మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రామ్ లల్లాను దర్శించుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక శ్రీరామనవమి ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయోధ్యలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆ రోజు అలంకరించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వస్త్రాలను సిద్ధం చేశారు. అలాగే వేల క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. ఇప్పటికే చాలా మంది భక్తులు అయోధ్యకు చేరుకోగా.. శ్రీరామనవమి నాటికి లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.