జర్నలిజాన్ని - కేంద్రం పునర్నిర్వచించాలి

జర్నలిజాన్ని - కేంద్రం పునర్నిర్వచించాలి
  • ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ 

చేవేళ్ల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుర్తింపునిస్తూ జర్నలిజాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ అనుబంధం) రంగారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభలు మంగళవారం ప్రగతి రిసార్ట్స్ లో నిర్వహించారు. ఇందులో దేవులపల్లితో పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ  హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు యాక్సిడెంటల్​ఇన్య్సూరెన్స్​కోసం ఇంద్రారెడ్డి ట్రస్ట్ తరఫున రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్​చార్జి  పట్లోళ్ల కార్తీక్ రెడ్డి రూ.3 లక్షల చెక్కు అందజేశారు. యూనియన్ ​ట్రెజరర్​ వెంకట్ రెడ్డి, రామనారాయణ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మఫిసిల్ కమిటీ చైర్మన్ పేపర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు మోతె వెంకట్ రెడ్డి,  రంగారెడ్డి జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంఘం రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఎండీ సలీమ్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.