దేవులపల్లి అమర్​కు డా.రఘురామిరెడ్డి అవార్డు

దేవులపల్లి అమర్​కు డా.రఘురామిరెడ్డి అవార్డు

పంజాగుట్ట, వెలుగు: మానసిక ఆరోగ్యంపై ముందుగా మీడియాలో చైతన్యం రావాలని, అప్పుడే ప్రజలకు చెప్పగలుగుతామని సీనియర్​జర్నలిస్ట్, మీడియా ఎడ్యుకేషన్​ఫౌండేషన్​ఇండియా మేనేజింగ్​ట్రస్టీ దేవులపల్లి అమర్ అన్నారు. ఐఎంహెచ్ హైదరాబాద్​అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో  సోమవారం ఎర్రగడ్డలోని మెంటల్​హెల్త్​సెంటర్ లో ‘మానసిక ఆరోగ్యం’పై ప్రజలకు అవగాహన కల్పించడంలో ‘మీడియా పాత్ర’ అనే అంశంపై  సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ మాజీ చైర్మన్​అల్లం నారాయణ దేవులపల్లి అమర్​కు డాక్టర్ రఘురామిరెడ్డి అవార్డు అందజేశారు. మాజీ ఎన్నికల కమిషనర్​సి.పార్థపారథి, హాస్పిటల్​సూపరింటెండెంట్​డాక్టర్​అనిత, ఐఎంహెచ్​హైదరాబాద్​జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ పి.కిషన్, కార్యదర్శి డాక్టర్​గిరిప్రసాద్, కోశాధికారి డాక్టర్​ శివ పాల్గొన్నారు.