ఎన్​సీటీఈకి దేవులవాడ టీచర్

ఎన్​సీటీఈకి దేవులవాడ టీచర్

కోటపల్లి, వెలుగు : నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్​సీటీఈ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ మిషన్ ఆన్ మానిటరింగ్ (ఎన్​ఎంఎం)  సభ్యురాలిగా కోటపల్లి మండలంలోని దేవులవాడ హైస్కూల్​ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు నూగురి అర్చన ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్​ఎం, సహచర టీచర్లు అర్చనను అభినందించారు. అర్చన 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ నేషనల్ మానిటరింగ్ కమిటీకి ఎంపిక చేసింది. ఈ మేరకు ఎన్​సీటీఈ–ఎన్​ఎంఎం కన్వీనర్ దినేశ్ చతుర్వేది నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుకున్నారు. మానిటరింగ్ మిషన్​లో భాగంగా జీవ శాస్త్ర బోధనా పద్ధతులు, ఆర్ట్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానాల కరికులం, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులకు అర్చన శిక్షణ ఇవ్వనున్నారు.