బిర్యానీ బై కిలోను రూ. 419 కోట్లకు కొనుగోలు చేసిన దేవయానీ

 బిర్యానీ బై కిలోను రూ. 419 కోట్లకు కొనుగోలు చేసిన దేవయానీ

న్యూఢిల్లీ: ‘బిర్యానీ బై కిలో’, ‘గోయిలా బటర్ చికెన్’, ‘ది భోజన్’ వంటి బ్రాండ్‌‌లను నిర్వహించే స్కై గేట్ హాస్పిటాలిటీలో 80.72 శాతం వాటాను రూ. 419.6 కోట్లకు కొనుగోలు చేస్తామని   క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్‌‌ఆర్‌‌‌‌) కంపెనీ  దేవయానీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (డీఐఎల్‌‌) గురువారం ప్రకటించింది.

  స్కై గేట్ ప్రస్తుతం ఇండియాలో  40కి పైగా సిటీల్లో  100కు పైగా అవుట్‌‌లెట్‌‌లను నిర్వహిస్తోంది.  ఇందులో డైన్- ఇన్ రెస్టారెంట్‌‌లు కూడా ఉన్నాయి. ఈ డీల్ తర్వాత స్కై గేట్ హాస్పిటాలిటీ దేవయానీ ఇంటర్నేషనల్‌‌కు సబ్సిడరీగా మారుతుంది. ఈ డీల్‌‌తో డీఐఎల్‌‌ దేశ ఫుడ్ ఇండస్ట్రీలో మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.  ఇండియాలో కేఎఫ్‌‌సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి క్యూఎస్‌‌ఆర్ రెస్టారెంట్లను  ఫ్రాంచైజీ విధానంలో డీఐఎల్ ఆపరేట్ చేస్తోంది.