IPL 2025: జూనియర్ ఏబీడీ వచ్చేస్తున్నాడు.. చెన్నై జట్టులోకి విధ్వంసకర ప్లేయర్

IPL 2025: జూనియర్ ఏబీడీ వచ్చేస్తున్నాడు.. చెన్నై జట్టులోకి విధ్వంసకర ప్లేయర్

ఐపీఎల్ 18 ఎడిషన్‎లో దారుణంగా విఫలమవుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. జూనియర్ ఏబీ డివిలియర్స్‎గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరాడు. పేసర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‎ను తీసుకుంది చెన్నై. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 18) ఈ విషయాన్ని చెన్నై అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. ఫైర్ పవర్‎ను జట్టులోకి తీసుకువస్తున్నట్లు ట్వీట్ చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎల్లో కలర్ (సీఎస్కే జెర్సీ కలర్)ను షేర్ చేసి చెన్నై జట్టులో భాగంగా కాబోతున్నట్లు వెల్లడించాడు. 

తమిళనాడుకు చెందిన ఎడమచేతి వాటం పేసర్ గుర్జప్నీత్ సింగ్‎ను మెగా వేలంలో సీఎస్కే రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. అనివార్య కారణాల వల్ల అతడు ఐపీఎల్ కు దూరం కావడంతో అతడి స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‎ను తీసుకుంది చెన్నై. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు 8 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. చెన్నై జట్టులో ప్రస్తుతం ఏడుగురు ఫారెన్  ప్లేయర్స్ ఉన్నారు. మరొకరిని తీసుకునే వెసులుబాటు ఉండటంతో డెవాల్డ్ బ్రెవిస్ తీసుకుంది చెన్నై. 

ఒక వైపు వరుస ఓటములు, మరోవైపు ఫామ్ లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం చెన్నైకు దెబ్బ మీద దెబ్బగా మారింది. ఈ తరుణంలో విధ్వంసకర ప్లేయర్, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రావడం చెన్నైకి కాస్తా రిలీఫేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస ఓటములతో ఢీలాపడ్డ సీఎస్కేను డెవాల్డ్ బ్రెవిస్ ఏ మేరకు ఆదుకుంటాడు చూడాలి మరీ. ఇక.. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది సీఎస్కే. 

 బ్రెవిస్ ఐపీఎల్ కెరీర్:

లాస్ట్ రెండు సీజన్లలో ఐపీఎల్‎లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీముల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు డెవాల్డ్ బ్రెవిస్. ఐపీఎల్ లో మొత్తం 10 మ్యాచులు ఆడిన బ్రెవిస్.. 133.72 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులు చేశాడు. అంచనాల మేర రాణించకపోవడంతో ముంబై బ్రెవిస్ ను రిటైన్ చేసుకోకుండా మెగా వేలానికి వదిలేసింది. 

అయితే.. మెగా వేలంలో అనూహ్యంగా ఈ 21 ఏళ్ల డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్‎ను ఏ ప్రాంఛైజ్ కొనుగోలు చేయకపోవడంతో అన్ సోల్డ్‎గా మిగిలిపోయాడు. ప్రస్తుతం చెన్నై మిడిలార్డర్ బలహీనంగా మారడంతో బ్రెవిస్ ను రూ.2.20 కోట్లకు చెన్నై జట్టులోకి తీసుకుంది. సీఎస్కే తరుఫున బ్రెవిస్ మూడో స్థానంలో బ్యాటింగ్‎కు వచ్చే అవకాశం ఉంది.