
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) 642 ఖాళీల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2025, జనవరి 18 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 642
విభాగాల వారీగా ఖాళీలు:
- జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్): 03
- ఎగ్జిక్యూటివ్ (సివిల్): 36
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 64
- ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం): 75
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 464
దరఖాస్తు రుసుము:
Gen/ OBC/ EWS అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు రూ. 1000.. మల్టీ-టాస్కింగ్ ఉద్యోగాలకు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. SC/ ST/ PwD/ ESM అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు కలదు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18 01/ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16/ 02/ 2025
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు. అందుకోసం ముందుగా DFCCIL అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.