భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఎఫ్‌వో జి. కిష్టాగౌడ్అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్‌పార్క్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అడవుల రక్షణలో భాగంగా ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించారు.
ఆదివాసీల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ప్రధానమన్నారు. అడవుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఏసీఎఫ్ యు. కోటేశ్వరరావు, అధికారులు దామోదర్‌రెడ్డి, బి. బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
దమ్మపేట : దమ్మపేట మండల కేంద్రంలోని దమ్మపేట రేంజ్ కార్యాలయంలో అటవీ రేంజ్ అధికారి కరుణాకరాచారి ఆధ్వర్యంలో అమరులైన అడవి శాఖ అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. దమ్మపేట మండల కేంద్రం నుంచి మందలపల్లి జాతీయ రహదారి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు.