చండ్రుగొండ, వెలుగు: పోడు పేరుతో అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్ఓ కృష్ణగౌడ్ హెచ్చరించారు. బుధవారం బెండాలపాడు శివారులోని ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ గతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుని హత్య చేసిన ప్రదేశంలో ప్లాంటేషన్ కోసం భూములను చదును చేస్తున్నట్లు తెలిపారు.
వర్షాకాలంలో 25 ఎకరాలలో మొక్కలు నాటుతామని తెలిపారు. ప్లాంటేషన్ పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య, సెక్షన్, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.