అమ్రాబాద్, వెలుగు:అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు డీఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. సోమవారం 4వ ఫేజ్ మానిటరింగ్ సర్వే రిపోర్ట్ ను ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా గత సర్వేతో పోలిస్తే వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. గతంలో 22గా ఉన్న పెద్ద పులుల సంఖ్య ప్రస్తుత సర్వే ప్రకారం 34కు చేరిందన్నారు. వీటిలో 11 మగ పులులు, 15 ఆడ పులులు, 8 పులి కూనలు గుర్తించినట్లు వెల్లడించారు.
మ్రాబాద్ టైగర్ రిజర్వ్ సర్కిల్ (నల్గొండ, నాగర్ కర్నూల్) నందు 4 బ్లాక్ లుగా విభజించి సర్వే చేసినట్లు చెప్పారు. 903 లోకేషన్స్‌లో 1806 కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసి 12 డిసెంబర్ 2023 నుంచి 2 మే 2024 వరకు సర్వే కొనసాగిందన్నారు. అడవిలో పెద్దపులులతో పాటు183 చిరుతలు, 14 వేల స్పాటెడ్ డీర్, 5309 సాంబార్, 2347 నీల్ గాయ్, 768 హార్మ్డ్ అంటిపోల్, 8030 అడవి పందులు, 4080 కొండముచ్చులు, కోతులు ఇతర జంతువులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
అడవి, వన్యప్రాణుల అభివృద్ధికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహించామని, కెమెరా ట్రాప్, వన్యప్రాణుల ఆహార అలవాట్లు, బయోలాజీ ల్యాబ్ ఏర్పాటు, ఆరోగ్య పరిస్తితి పరిశీలన, గ్రాస్ లాండ్ పెంపకం, కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన లైవ్ కెమెరాల ఏర్పాటు సత్ఫలితాలను ఇచ్చినట్లు వివరించారు.
న్యప్రాణుల అభివృద్ధిలో స్థానిక ప్రజల సహకారం మరువలేనిదని, మరింత సహకారం అందిస్తే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలు చేపడతామని రోహిత్ పేర్కొన్నారు.