బడ్జెట్ లో పన్ను స్లాబుల్లో మార్పులు.. 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో డిపాజిట్స్ పెరుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి రూ. 40 వేల నుంచి 45 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ .
బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ₹12 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) థ్రెషోల్డ్‌ను ఆర్థిక సంవత్సరానికి రూ. 40,000 నుంచి రూ. 50,000కి పెంచుతున్నట్లు కూడా ప్రతిపాదించింది. 60 ఏళ్ల లోపు ఉన్న జనరల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. సవరించిన కొత్త పన్ను పరిమితి అనేది 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
ALSO READ | డాలర్ కళకళ.. రూపాయి విలవిల.. ట్రంప్ విధానాలపై ప్రధాని మోదీ స్పందనేది..?
సీనియర్ సిటిజన్లు సంపాదించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ TDS థ్రెషోల్డ్ ఆర్థిక సంవత్సరం 2026 నుంచి రూ.50,000 నుంచి లక్ష వరకు పెరుగుతుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రూ. 40 వేల కోట్ల నుంచి -45 వేల కోట్లు బ్యాంకుల్లోకి డిపాజిట్లుగా వస్తాయని అంచనా. అదనపు డిపాజిట్లు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క లిక్విడిటీని పెంచుతాయి. అలాగే అధిక ఖర్చుతో కూడిన రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం నాగరాజు మీడియాకు తెలిపారు.
టీడీఎస్ అంటే
TDS..ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ..TDS అనేది చేసిన చెల్లింపుల నుంచి పన్ను మినహాయింపు. కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నును టీడీఎస్ అంటారు. సాలరీలు, రెంట్లు,పేమెంట్స్, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజు లాంటి పేమెంట్లపై ఈ టీడీఎస్ వర్తిస్తుంది. పన్ను ఎగవేతను నివారించేందుకు, ట్యాక్స్‌ను ముందుగానే చెల్లించేలా చేసేందుకు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.