ఎయిర్ విస్తారాకు 10లక్షల ఫైన్

ఎయిర్ విస్తారాకు 10లక్షల ఫైన్

ఎయిర్ విస్తారాకు 10లక్షల ఫైన్ పడింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీసీఏ 10 లక్షల జరిమాన విధించింది. సరిగ్గా శిక్షణ పొందని పైలట్ కు ల్యాండ్ చేయడానికి అనుమతించడంతో పాటు టేకాఫ్, ల్యాండింగ్ క్లియరెన్స్ లను ఉల్లఘించినందుకు జరిమాన విధించింది. మధ్యప్రదేశ్ ఇండోర్ ఎయిర్ పోర్టులో ప్యాసెంజర్స్ తో ఉన్న విమానాన్ని అనుభవం లేని నడిపారు. పైలట్ సిమ్యులెటర్ లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు. ఇది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడమే అంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా ప్రయాణికులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్ లో పైలట్ కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందవలసి ఉంటుంది. అయితే ఈ ఘటనలో కెప్టెన్,పైలెట్ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన చర్య అని అధికారులు 10లక్షల ఫైన్ వేశారు. 

 

మరిన్ని వార్తల కోసం

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆకట్టుకుంటున్న విరాటపర్వం నగాదారిలో సాంగ్