Airport Jobs: DGCAలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం

Airport Jobs: DGCAలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు, నెలకు రూ.7 లక్షల జీతం

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్(FOI) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. మంచి చదువులు, నైపుణ్యం ఉండాలే కానీ లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 2025 మార్చి 7 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే.  

మొత్తం ఖాళీలు: 16

విభాగాలు.. జీతం

  • సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (విమానం, ఒక పోస్ట్): రూ. 7,46,000 
  • ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (విమానం, 10 పోస్టులు): రూ. 5,02,800
  • ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (హెలికాప్టర్, 5 పోస్టులు): రూ. 2,82,800

అర్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2 లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు చెల్లుబాటయ్యే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) లేదా కమర్షియల్ హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ (CHPL) కలిగి ఉండాలి. DGCA నిర్దేశించిన ఇతర అర్హత షరతులు వర్తిస్తాయి.

వయోపరిమితి: 

  • కనీస వయస్సు- 58 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు- సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్.. 64 సంవత్సరాలు.

ఎంపిక విధానం: ఎటువంటి  రాత పరీక్ష లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

కాంట్రాక్ట్ వ్యవధి: ఎంపికైన అభ్యర్థులను ఒక ఏడాది పాటు కాంట్రాక్టుపై నియమిస్తారు. ఆ సమయంలో పనితీరు ఆధారంగా పొడిగింపుకు అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

దరఖాస్తు ప్రక్రియ:

అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత ఇమెయిల్ రూపంలో దరఖాస్తు కాపీ అందుతుంది. ఆ కాపీ ప్రింట్ తీసుకొని దానిపై ఫోటో అతికించాలి.. సంతకం చేయాలి. తరువాత దానికి అవసరమైన ఇతర పత్రాలు జత చేసి కింది చిరునామాకు పంపాలి.

Recruitment Department,
A Block, Directorate General of Civil Aviation,
Opposite Safdarjung Airport,
New Delhi - 110003

దరఖాస్తులకు చివరి తేదీ: 07 మార్చి 2025 (మధ్యాహ్నం 3 గంటల వరకు)

నోటిఫికేషన్ కోసం ఇక్కడ DGCA Recruitment 2025 (Engagement of Consultant (FOIs)) క్లిక్ చేయండి.

Also Read:- ఐడీబీఐ బ్యాంకులో 650 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..