ఓసీపీ–3లో బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు పడుతున్నాం

గోదావరిఖని, వెలుగు:  సింగరేణి ఓసీపీ–3లో బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌ వల్ల వెలువడుతున్న దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామని గోదావరిఖని విఠల్​నగర్​, తిలక్​నగర్​, ఫైవింక్లయిన్​ ఏరియాకు చెందిన ప్రజలు తమ గోడును డిప్యూటీ డైరెక్టర్​ ఆఫ్​ మైన్స్​సేప్టీ (డీజీఎంఎస్)కు చెప్పుకున్నారు.

గురువారం డీజీఎంఎస్​ వెంకన్న గోదావరిఖనికి వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓసీపీ 3లో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్​చేస్తున్నారని, దానివల్ల భారీగా దుమ్ము, ధూళి వెలువడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని స్థానికులు మద్దెల దినేశ్​, పెద్దెల్లి ప్రకాశ్​, నరేంద్ర, చంద్రశేఖర్​, తిరుమల, తదితరులు డీజీఎంఎస్​కు వివరించారు.