హైదరాబాద్,వెలుగు : సినిమాల్లో పోలీస్ పాత్రలను పాజిటివ్ కోణంలో చూపాలని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలను డీజీపీ అంజనీ కుమార్ కోరారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్నారని డీజీపీ అన్నారు. సోమవారం జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మార్పునకు ఉత్ర్పేరకంగా సినిమా' అంశంపై సెమినార్‌లో డీజీపీ పాల్గొన్నారు.
‘భారత్‌లో హిందీ చిత్రపరిశ్రమ కంటే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దది. నేను ఇక్కడి సినిమా డైరెక్టర్లను, సీనియర్ నటులను, నిర్మాతలను కోరేది ఒక్కటే.. సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు తీసేందుకు రిస్క్ తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొలిపే శక్తి చిత్రపరిశ్రమకు ఉంది’ అన్నారు. సమాజ సేవలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారన్నారని డీజీపీ వెల్లడించారు.