సైబర్ నేరాలు అరికట్టడంలో దేశంలో ఫస్ట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలను అరికట్టడంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే ఫస్ట్​ప్లేస్​లో ఉన్నారని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌, నేరాల నియంత్రణకు సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రమని చెప్పారు. న్యూఢిల్లీ కేంద్రంగా ‘గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ–-2023’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సెమినార్ లో ఆయన మాట్లాడారు. ‘నేషనల్ ఆర్కిటెక్చర్ ఫర్‌‌‌‌‌‌‌‌ సైబర్ స్పేస్ మేనేజ్‌‌‌‌మెంట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్‌‌‌‌’ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్ అనే అంశంపై ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్ తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటయ్యాయని తెలిపారు. దాదాపు10 లక్షల మంది ఐటీ ఆధారిత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారని చెప్పారు.

సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పెరుగుతోంది

ప్రస్తుతం ప్రపంచంలో సైబర్‌‌‌‌ నేరాలు పెరిగిపోయాయని అంజనీ కుమార్​ అన్నారు. రాష్ట్రంలో 2019 లో 2,691 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 2020లో 5,024 ,2021లో 10,303 , 2022 లో 15,217 కేసులు నమోదయ్యాయని వివరించారు. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలను ఎదుర్కొనేందుకు స్పెషల్‌‌‌‌ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన బ్యూరోలో సైబర్ నిపుణులను 500 మందిని నియమించామని వివరించారు. తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలక పాత్ర వహిస్తోందని వెల్లడించారు. టీ 4సీ ద్వారా రూ.65 కోట్లు సైబర్ నేరగాళ్లకు చేరకుండా అడ్డుకున్నామని తెలిపారు.