హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో కేంద్ర హోంశాఖ మెడల్స్ కు ఎంపికైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆర్ సత్యనారాయణ రాజు, వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి, బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, సీఎస్ డబ్ల్యూ డిప్యూటీ ఎస్పీ బీ శ్రీనివాస్ రావులను సోమవారం డీజీపీ సన్మానించారు.
తెలంగాణ కేడర్‌కు చెందిన నలుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగం వివరాలను వెల్లడించారు. డీజీపీతో సమావేశమైనవారిలో ప్రొబేషనరీ అధికారులు రాధిక గుప్తా, డా. శ్రీజ, ఫైజన్ అహ్మద్, గౌతమి, పింకేశ్ కుమార్, లెనిన్ వత్సల్ తొప్పో, శివేంద్రప్రతాప్, సంచిత్ గంగ్వార్ ఉన్నారు.